
POWERGRID Apprenticeship Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి యువతకు POWERGRID (Power Grid Corporation of India Limited) ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరైతె ITI మరియు Diploma చేసి ఉన్నారో అటువంటి వారు అందరూ ఈ యొక్క నోటిఫికేషన్ కి అర్హులు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, ఇది కేవలం ఒక సంవత్సరం Apprenticeship Training కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ Apprentices Act, 1961 ప్రకారం విడుదలైంది. కావున పూర్తి వివరాలు తెలుసుకోండి.
POWERGRID Apprenticeship Recruitment 2026: పోస్టులు
ఈ SR-I నోటిఫికేషన్‌లో తెలంగాణకు 8 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 14 పోస్టులు, మొత్తం 22 Apprenticeship Training పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ – 8 పోస్టులు
- ITI Electrician – 2
- Diploma Civil – 1
- Diploma Electrical – 4
- Graduate Electrical – 1
ఆంధ్రప్రదేశ్ – 14 పోస్టులు
- ITI Electrician – 3
- Diploma Civil – 3
- Diploma Electrical – 6
- Graduate Electrical – 2
ఈ స్లాట్లు తాత్కాలికమైనవి. కంపెనీ అవసరాలకు అనుగుణంగా సంఖ్యలో మార్పులు ఉండవచ్చని POWERGRID పేర్కొంది.
POWERGRID Apprenticeship Recruitment 2026: ముక్యమైన వివరాలు
- Apprenticeship వ్యవధి: 1 సంవత్సరం
- దరఖాస్తు విధానం: Online
- Application Fee: ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
- Written Exam: లేదు
- Interview: లేదు
POWERGRID Apprenticeship Recruitment 2026: ఎవరు అర్హులు?
ITI Electrician పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ITI Electrician Trade పూర్తి చేసి ఉండాలి.
Diploma Civil పోస్టుకు Diploma in Civil Engineering ఉండాలి.
Diploma Electrical పోస్టుకు Diploma in Electrical Engineering ఉండాలి.
Graduate Electrical పోస్టుకు B.E / B.Tech / B.Sc (Engineering) – Electrical Engineering అర్హత ఉండాలి. విద్యార్హత తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి Full-Time Regular విధానంలో ఉండాలి. Part-time, correspondence, distance లేదా online qualificationలు అర్హత కావు.
అభ్యర్థులు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఎవరైతే 11 సెప్టెంబర్ 2024 నుంచి 10 సెప్టెంబర్ 2026 మధ్య ఉత్తీర్ణత పొందారో వారు మాత్రమే అర్హులు. చివరి పరీక్ష ఫలితం ఇంకా రాని అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు కారు . ఇప్పటికే ఏదైనా సంస్థలో Apprenticeship చేసిన వారు లేదా ప్రస్తుతం Apprenticeship చేస్తున్న వారు కూడా అర్హులు కాదు. అలాగే 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు కాదు.
POWERGRID Apprenticeship Recruitment 2026: జీతము వివరాలు
ఇది regular permanent job కాకుండా Apprenticeship Training, కాబట్టి నెలవారీ Stipend చెల్లిస్తారు.
- ITI Electrician: నెలకు ₹13,500
- Diploma Civil: నెలకు ₹15,000
- Diploma Electrical: నెలకు ₹15,000
- Graduate Electrical: నెలకు ₹17,500
Diploma అభ్యర్థులకు ₹5,450 మరియు Graduate అభ్యర్థులకు ₹6,150 వరకు Government DBT ఇందులో భాగంగా ఉంటుంది. కంపెనీ accommodation ఇవ్వకపోతే అదనంగా ₹2,500 చెల్లించే నిబంధన కూడా ఉంది. దీని వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25 ఆగస్టు 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 10 సెప్టెంబర్ 2026
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా ITI అభ్యర్థులు NAPS, Diploma/Engineering అభ్యర్థులు NATSలో Registration చేసుకోవాలి. ఆ తర్వాత POWERGRID అధికారిక వెబ్‌సైట్‌లో Careers → Engagement of Apprentices → Apply Online ద్వారా దరఖాస్తు చేయాలి. ఆధార్ లింకు అయి ఉండాలి, DBT-enabled bank account వివరాలు కూడా అవసరం.
ముఖ్యంగా: ఒక్క అభ్యర్థి ఒకే Region/State/Tradeకు దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే దరఖాస్తు తిరస్కరించబడవచ్చు. Apprenticeship పూర్తయిన తర్వాత POWERGRIDలో శాశ్వత ఉద్యోగం పొందే హక్కు ఉండదు. కావున ఎవరైతే ఒక సంవత్సరం చేసి ఆ అనుబవం తో తర్వాత వేరే సంస్థల్లో చేయాలి అనుకుంటారో వారికి మాత్రం మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ PDF లింకు : క్లిక్ చేయండి
వెబ్సైట్ లింకు : క్లిక్ చేయండి
మరిన్ని జాబ్స్ కంటెంట్ కోసం మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి , అలాగే పైన ఇచ్చిన whats app channel లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నోటిఫికేషన్ updates ఇస్తాము.
