Latest APPSC Hostel Welfare Officer Recruitment 2026: 73 ఉద్యోగాలు | జీతం రూ.1.15 లక్షల వరకు | Apply Online

APPSC Hostel Welfare Officer Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో జరుగుతాయి. మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ కు అర్హులైన వారు 09-10-2026 నుండి అప్లై చేసుకోవచ్చు.

Join Our WhatsApp Group
Join Now
APPSC Hostel Welfare Officer Recruitment 2026

ఏన్ని పోస్టులు?

  • Social Welfare Subordinate Service: 21 పోస్టులు
  • Tribal Welfare Subordinate Service: 23 పోస్టులు
  • Backward Classes Welfare Subordinate Service: 29 పోస్టులు

మొత్తం: 73 పోస్టులు

విద్యార్హత

ప్రస్తుతం APPSC విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు సంబంధించిన పూర్తి విద్యార్హత వివరాలు వెల్లడించలేదు. పూర్తి విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్ తదితర నిబంధనలు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో ప్రకటించనున్నట్లు సమాచారం. డిటైల్డ్ నోటిఫికేషన్ 09-10-2026 నాటికి అందుబాటులోకి వస్తుంది.

వయసు

వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో ప్రకటించాల్సి ఉంది. కాబట్టి అభ్యర్థులు అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వయసు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

జీతం

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు రూ.37,640 – రూ.1,15,500 పే స్కేల్ ఉంటుంది.

జాబ్ వివరణ

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల వసతి, సంక్షేమం, క్రమశిక్షణ, హాస్టల్ నిర్వహణ వంటి బాధ్యతలకు సంబంధించిన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ శాఖల్లో ఉన్నాయి.

జాబ్ లొకేషన్

APPSC Hostel Welfare Officer Recruitment 2026 పోస్టుల యొక్క లొకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంబంధిత ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజు మరియు ఇతర ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలు డిటైల్డ్ నోటిఫికేషన్‌ 09-10-2026లో స్పష్టంగా తెలుస్తుంది.

ఎంపిక విధానం

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒకే దశలో Computer Based Recruitment Test (CBRT) నిర్వహించే విధానం ఉంది. ప్రత్యేక Screening Test ఉండదని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

APPSC Hostel Welfare Officer Recruitment 2026 కు అప్లై చేసే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 09-10-2026 నుంచి 29-10-2026 వరకు కొనసాగుతుంది.

ముఖ్యమైన తేదీలు

వివరాలు తేదీ
నోటిఫికేషన్ విడుదల15-09-2026
డిటైల్డ్ నోటిఫికేషన్09-10-2026 నాటికి
దరఖాస్తులు ప్రారంభం09-10-2026
దరఖాస్తులకు చివరి తేదీ29-10-2026
Join Our WhatsApp Group
Join Now

అధికారిక లింక్స్

APPSC Official Website:

APPSC Official Notification PDF:

గమనిక: ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నది బ్రీఫ్ నోటిఫికేషన్ కాబట్టి పూర్తి వివరాలు తెలియదు. కాబట్టి ఈ APPSC Hostel Welfare Officer Recruitment 2026 నోటిఫికేషన్ కు సంబందించి విద్యార్హత, వయసు, ఫీజు, సిలబస్ తదితర పూర్తి వివరాల కోసం డిటైల్డ్ నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించండి. APPSC అధికారిక రిక్రూట్‌మెంట్ పేజీలో నోటిఫికేషన్ నం.25/2026ను ధృవీకరించవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top