Southern Railway Apprentice Recruitment 2026: దక్షిణ రైల్వే (Southern Railway) పరిధిలో 2026–27 సంవత్సరానికి Act Apprentice Training కోసం భారీగా 4,471 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే 10వ తరగతి, ITI అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నియామకం Apprentices Act, 1961 కింద శిక్షణ కోసం మాత్రమే,శిక్షణ పూర్తయిన వెంటనే రెగ్యులర్ ఉద్యోగం లభిస్తుందనే హామీ ఉండదు. ఎవరైతే ఈ యొక్క Apprentice Recruitment కు అర్హులై ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం. కాబట్టి లేట్ చేయకుండా అప్లై చేస్కోండి.

మొత్తం ఎన్ని పోస్టులు?
Southern Railway Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,471 Act Apprentice స్థానాలు ఉన్నాయి.
- Fresher: 163 పోస్టులు
- Ex-ITI: 4,308 పోస్టులు
- మొత్తం: 4,471 పోస్టులు
Fitter, Painter, Welder, Electrician, Machinist, Turner, Carpenter, Plumber, COPA/PASAA, Electronics Mechanic, Draughtsman వంటి వివిధ ట్రేడ్లలో అవకాశాలు ఉన్నాయి.
విద్యార్హత
ఈ యొక్క పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేసుకునే ట్రేడ్‌ను బట్టి విద్యార్హత మారుతుంది.
Fresher అభ్యర్థులకు:
- 10వ తరగతి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత అవసరం.
- కొన్ని Fresher ట్రేడ్లకు 12వ తరగతి PCMBతో కనీసం 50% మార్కులు అవసరం.
Ex-ITI అభ్యర్థులకు:
- 10వ తరగతి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
- సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT ITI సర్టిఫికేట్ ఉండాలి.
- Electrician, Electronics Mechanic వంటి కొన్ని ట్రేడ్లకు అదనపు సబ్జెక్ట్ అర్హతలు వర్తిస్తాయి.
SC/ST/PwBD అభ్యర్థులకు 10వ తరగతిలో 50% మార్కుల నిబంధనలో మినహాయింపు ఉంది.
వయసు
ఈ Southern Railway Apprentice Recruitment 2026 అప్రెంటిస్‌షిప్‌కు అభ్యర్థి కనీస వయసు 15 సంవత్సరాలు దాటి ఉండాలి. గరిష్ఠ వయసు సాధారణంగా 24 సంవత్సరాలుగా ఉంది. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్
ఇది రెగ్యులర్ ఉద్యోగం కాకుండా Apprenticeship Training కావడంతో నెలవారీ జీతం బదులుగా స్టైపెండ్ అందుతుంది.
- Fresher Fitter/Painter/Welder – సుమారు ₹8,200 నెలకు
- MLT వంటి కొన్ని విభాగాలు – సుమారు ₹9,600 నెలకు
- Ex-ITI ట్రేడ్లకు – సుమారు ₹9,600 నెలకు
శిక్షణ రెండు లేదా మూడు సంవత్సరాలకు స్టైపెండ్ పెరుగవచ్చని నోటిఫికేషన్ వివరాలు సూచిస్తున్నాయి.
జాబ్ లొకేషన్
ఈ అప్రెంటిస్ శిక్షణ అవకాశాలు Southern Railway పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాపులు మరియు యూనిట్లలో ఉంటాయి.
Southern Railway Apprentice Recruitment 2026 కు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రధానంగా ఈ ప్రాంతాలకు చెందినవారై ఉండాలి:
- తమిళనాడు
- పుదుచ్చేరి
- కేరళ
- అండమాన్ & నికోబార్ దీవులు
- లక్షద్వీప్
- ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, SPSR నెల్లూరు జిల్లాలు మాత్రమే అర్హులు
- కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా మాత్రమే
అప్లికేషన్ ఫీజు
- ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు ₹100 ఉంటుంది.
- SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
Southern Railway Apprentice Recruitment 2026 అప్రెంటిస్ పోస్టులకు రాత పరీక్ష గాని ఇంటర్వ్యూ గాని ఉండదు, మెరిట్ లిస్ట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది.
ఈ పోస్టులకు 10వ తరగతి మరియు ITIలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మెరిట్ రూపొందిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను Document Verification (DV) కోసం పిలుస్తారు.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఇది Apprenticeship Training మాత్రమే. శిక్షణ పూర్తయిన తర్వాత నేరుగా రైల్వే రెగ్యులర్ ఉద్యోగం లభిస్తుందని హామీ లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ వెబ్సైట్ https://sronline.etrpindia.com/ దరఖాస్తు చేయాలి.
- Southern Railway Apprentice అధికారిక అప్లికేషన్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- వ్యక్తిగత, విద్యార్హత మరియు కేటగిరీ వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో తదితర పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఫారమ్‌ను Submit చేసి Application/Acknowledgement కాపీని భద్రపరచుకోవాలి.
Southern Railway Apprentice Recruitment 2026 కు ఒక అభ్యర్థి ఒకే ప్రాంతం లేదా ఒకే ట్రేడ్‌కు దరఖాస్తు చేయాలని సూచించారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ తేదీ | 28 ఆగస్టు 2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 28 ఆగస్టు 2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 27 సెప్టెంబర్ 2026 |
| చివరి సమయం | సాయంత్రం 5:00 గంటల వరకు |
| DV షార్ట్‌లిస్ట్ – అంచనా | 15 అక్టోబర్ 2026 |
అధికారిక లింక్స్
అధికారిక నోటిఫికేషన్ PDF:
Southern Railway అధికారిక వెబ్‌సైట్:
ముఖ్యమైన గమనిక
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో తమ ట్రేడ్, వయసు, విద్యార్హత, నివాస ప్రాంతం మరియు ఇతర అర్హతలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్‌లోని ఎంపిక Apprenticeship Training కోసం మాత్రమే.
మరిన్ని జాబ్ updates కోసం మా వెబ్సైట్ ని ఫాలో చేయండి. మా అఫిసియల్ whatsapp చానెల్ లో జాయిన్ అవ్వండి.
