AP High Court Jobs 2026: ఎవరైతే అనుబవం ఉండి న్యాయవ్యవస్తా లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి నుంచి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ నియామకం లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎక్సామినెసన్ (LDCE) ద్వారా వేగవంతమైన పదోన్నతి కోసం నిర్వహిస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సాధారణ అభ్యర్థులు, ఫ్రెషర్లు లేదా బయటివారు దరఖాస్తు చేయకుడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవలో ప్రస్తుతం Civil Judge (Junior Division)గా పనిచేస్తున్న వారు మాత్రమే, నిర్దిష్ట సర్వీస్ అర్హతతో దరఖాస్తు చేసుకోవాలి.

ఎన్ని పోస్టులు?
Civil Judge (Senior Division) – 16 పోస్టులు
- Open Competition – 12 పోస్టులు
- SC Group I – 1
- SC Group II – 1
- SC Group III – 1
- ST – 1
విద్యార్హత
AP High Court Jobs 2026 కు అప్లై చేసే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవలో Civil Judge (Junior Division)గా పనిచేస్తూ ఉండాలి. అలాగే 31-03-2026 వరకు కనీసం మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న సర్వీస్, విద్యార్హత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
వయసు
ఈ AP High Court Jobs 2026 (LDCE) నియామకానికి సాధారణ ఉద్యోగ నియామకాల మాదిరిగా ప్రత్యేక గరిష్ఠ వయోపరిమితి కాకుండా, ప్రస్తుతం Civil Judge (Junior Division)గా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ అర్హతలు ప్రధానంగా వర్తిస్తాయి.
జీతం
ఎంపికైన Civil Judge (Senior Division) పోస్టుకు పే స్కేల్:
₹1,11,000 – ₹1,63,030
జాబ్ వివరణ
AP High Court Jobs 2026 కు ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవలో Civil Judge (Senior Division)గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే రిక్రూట్మెంట్ కాకుండా, ప్రస్తుతం Civil Judge (Junior Division)గా పనిచేస్తున్న వారికి LDCE ద్వారా పదోన్నతి కల్పించే నియామకం.
జాబ్ లొకేషన్
ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే
పోస్టింగ్‌కు సంబంధించిన వివరాలు హైకోర్టు నిబంధనలు, పరిపాలనా అవసరాల ప్రకారం ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
- OC / EWS / BC – ₹1,000
- SC / ST / PwBD – ₹500
ఫీజును Demand Draft రూపంలో High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati పేరిట చెల్లించాలి.
ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి:
- స్క్రీనింగ్ టెస్ట్
- Written ఎక్సామ్
- Viva Voce
- తుది మెరిట్ ఆధారంగా ఎంపిక
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే 100 ప్రశ్నలు, 100 మార్కులతో పరీక్ష ఉంటుంది. Written Examinationలో సివిల్ లా, క్రిమినల్ లా మరియు ఇంగ్షీషు Translation & Essay Writing కు సంబందించి పేపర్లు ఉంటాయి. Viva Voceకు 50 మార్కులు ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
- AP హైకోర్టు అధికారిక వెబ్సైట్ https://aphc.gov.in/ను సందర్శించాలి.
- Civil Judge (Senior Division) LDCE నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- నిర్దేశిత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
- అవసరమైన విద్యా, సర్వీస్, కేటగిరీ ధ్రువపత్రాలను జత చేయాలి.
- సంబంధిత ఫీజుకు Demand Draft జత చేయాలి.
- పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత Principal District Judge కార్యాలయంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: 17 సెప్టెంబర్ 2026
- దరఖాస్తు చివరి తేదీ: 1 అక్టోబర్ 2026
అధికారిక లింక్స్
Official Notification PDF:
Official Website:
