TGPSC Recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB)లో Manager (Engineering) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 130 Manager (Engineering) పోస్టులు భర్తీ చేయనున్నారు. కావున అర్హులైన వారు 17-10-2026 లోపు అప్లై చేస్కోండి.

TGPSC Recruitment 2026 మొత్తం పోస్టులు
Manager (Engineering) – 130 పోస్టులు
ఈ TGPSC Recruitment 2026 పోస్టులు Multi Zone-II పరిధిలో భర్తీ చేయబడతాయి. ఇందులో Civil Engineering, Electrical/Mechanical Engineering, CSE/IT/ECE Engineering విభాగాలకు పోస్టులు కేటాయించారు.
విద్యార్హత
అభ్యర్థులు తప్పనిసరిగా Engineering Graduate Degree కలిగి ఉండాలి.
పోస్టుల విభజన ఇలా ఉంటుంది:
- 80% పోస్టులు – Civil Engineering
- 15% పోస్టులు – Electrical / Mechanical Engineering
- 5% పోస్టులు – CSE / IT / ECE Engineering
విద్యార్హతకు సంబంధించిన ఫలితం నోటిఫికేషన్ తేదీ 18-09-2026 నాటికి ప్రకటించబడి ఉండాలి.
వయసు
01-07-2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయసు: 44 సంవత్సరాలు
- SC/ST/BC/EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు
- దివ్యాంగులకు: 10 సంవత్సరాల సడలింపు
- Ex-Servicemen, NCC మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం
TGPSC Recruitment 2026 (HMWSSB) కుఎంపికైన అభ్యర్థులకు ₹54,220 – ₹1,33,630 పే స్కేల్ లభిస్తుంది.
ఉద్యోగ వివరణ
TGPSC Recruitment 2026, Manager (Engineering)గా ఎంపికైన అభ్యర్థులు HMWSSBకు సంబంధించిన Engineering విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థుల Engineering Branch ఆధారంగా సంబంధిత సాంకేతిక మరియు పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి.
ఈ నియామకం Multi Zone-II పరిధిలో ఉంటుంది. Multi Zone-IIలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
జాబ్ లొకేషన్
తెలంగాణ లో Multi Zone-II
పోస్టింగ్ HMWSSB పరిధిలో, నోటిఫికేషన్లో పేర్కొన్న Multi Zone-II ప్రకారం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
- OC & BC అభ్యర్థులు: ₹1,000
- SC/ST/PwD అభ్యర్థులు: ₹500
- Examination Fee: ₹120
- నిరుద్యోగ అభ్యర్థులకు Examination Fee నుంచి మినహాయింపు ఉంటుంది.
- ప్రభుత్వ ఉద్యోగులు Examination Fee చెల్లించాలి.
ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక Objective Type Written Examination ద్వారా జరుగుతుంది. పరీక్షను CBRT లేదా OMR విధానంలో నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్షలో మొత్తం 450 మార్కులు ఉంటాయి:
- Paper-I: General Studies & General Abilities – 150 ప్రశ్నలు, 150 మార్కులు
- Paper-II: Concerned Subject – 150 ప్రశ్నలు, 300 మార్కులు
- మొత్తం: 450 మార్కులు
Paper-I పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఉంటుంది. Paper-II ఇంగ్లీష్‌లో ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా TGPSC అధికారిక వెబ్సైట్లో OTR నమోదు చేసుకోవాలి.
- ఇప్పటికే OTR ఉన్న అభ్యర్థులు తమ TGPSC IDతో Login చేయాలి.
- Online Application Linkపై క్లిక్ చేయాలి.
- TGPSC ID, Date of Birth మరియు OTPతో Login అవ్వాలి.
- వ్యక్తిగత, విద్యార్హత మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి.
- Application Formను Submit చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ: 18-09-2026
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-09-2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 17-10-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
- హాల్ టికెట్: పరీక్షకు 7 రోజుల ముందు నుంచి
- పరీక్ష: డిసెంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది
- పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని TGPSC తరువాత ప్రకటిస్తుంది.
TGPSC Recruitment 2026 అధికారిక లింక్స్
TGPSC అధికారిక వెబ్సైట్:
అధికారిక నోటిఫికేషన్ PDF:
