Latest IRCTC Recruitment 2026: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), లో సౌత్ సెంట్రల్ జోన్ నుంచి Hospitality Monitors పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న Hotel Management లేదా Hospitality ప్రొఫెషనల్స్ ఈ ఉద్యోగాలకు Walk-in Interview ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం అనేది మొదట 2 సంవత్సరాల Fixed Term Contract ప్రాతిపదికన ఉంటుంది. అవసరం, పనితీరు ఆధారంగా మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉండవచ్చు. కాబట్టి అర్హులైన వారు అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టులు
Hospitality Monitors – 22 పోస్టులు
ఇందులో 4 OBC backlog vacancies ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
విద్యార్హత
Latest IRCTC Recruitment 2026 కు సంబందించి కింది అర్హతల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి:
- Full-time B.Sc. Hospitality & Hotel Administration
- BBA/MBA (Culinary Arts)
- ముక్యంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc. Hotel Management & Catering Science మరియు MBA (Tourism & Hotel Management) చేసి ఉండాలి.
అభ్యర్థులకు కంప్యూటర్ లో MS Office పరిజ్ఞానం, రిపోర్టుల తయారీ సామర్థ్యం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
వయసు
01-09-2026 నాటికి గరిష్ఠ వయసు:
- అనుభవం లేకపోతే: 28 సంవత్సరాలు
- 1 సంవత్సరం అనుభవం ఉంటే: 30 సంవత్సరాలు
- 2 సంవత్సరాల అనుభవం ఉంటే: 35 సంవత్సరాలు
SC/ST, OBC, PwBD, Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం
Latest IRCTC Recruitment 2026 Hospitality Monitor పోస్టుకు సంబందించి నెలకు ₹30,000 CTC/పే స్కేలు లభిస్తుంది. అదనంగా విధి నిర్వహణ సమయంలో Daily Allowance, Lodging Charges, National Holiday Allowance మరియు Medical Insurance వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
జాబ్ వివరణ
ఎంపికైన అభ్యర్థులు రైల్వే క్యాటరింగ్ సేవల్లో ఆహార నాణ్యత, ఉత్పత్తి మరియు సేవలను పర్యవేక్షించాలి. అలాగే వందే భారత్, మెయిల్/express, టూరిస్ట్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ట్రైన్స్ వంటి రైళ్లలో Mobile Catering Unitsతో పాటు Base Kitchens, Cluster Kitchens మరియు Static Catering Unitsను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
అలాగే పరిశుభ్రత, పరికరాల నిర్వహణ, ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది పనితీరు, కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు Hospitality Standards అమలును పర్యవేక్షించాలి. అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణిస్తూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Latest IRCTC Recruitment 2026 జాబ్ లొకేషన్
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో పోస్టింగ్ ఉండవచ్చు. అయితే IRCTC అవసరాన్ని బట్టి అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ చేయవచ్చు.
అప్లికేషన్ ఫీజు
Latest IRCTC Recruitment 2026 నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా అప్లికేషన్ ఫీజు పేర్కొనలేదు. ఎవరైతే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వారు ₹25,000 Security Deposit ను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాలి. కనీసం ఒక సంవత్సరం సేవ చేయకపోతే ఈ మొత్తాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక Walk-in Interview ద్వారా జరుగుతుంది. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన ధృవీకరించిన కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూలో అభ్యర్థి అర్హతలు, పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
Latest IRCTC Recruitment 2026 కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న Application Formను పూర్తి చేయాలి. అవసరమైన విద్యార్హత, వయసు, కేటగిరీ మరియు ఇతర సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుని, నిర్ణయించిన తేదీన Walk-in Interview వేదికకు నేరుగా హాజరు కావాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ: 16-09-2026
- భువనేశ్వర్ Walk-in Interview: 05-10-2026
- హైదరాబాద్ Walk-in Interview: 08-10-2026
- ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు
హైదరాబాద్ వేదిక: IRCTC Ltd, 1st Floor, Oxford Plaza, Sarojini Devi Road, Secunderabad – 500003.
అధికారిక లింక్స్
IRCTC Official Notification PDF:
IRCTC Official Website:
