APCRDA Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA), అమరావతి నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. APCRDA Recruitment 2026 ద్వారా లీగల్ విభాగంలో Assistant Manager Legal పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 4 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు APCRDA అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

APCRDA Recruitment 2026 ముఖ్యమైన వివరాలు
- సంస్థ: Andhra Pradesh Capital Region Development Authority (APCRDA)
- పోస్టులు : Assistant Manager Legal
- ఖాళీల సంఖ్య: 4
- ఉద్యోగ స్థలం: అమరావతి, గుంటూరు జిల్లా
- ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ ప్రాతిపదికన
- కాంట్రాక్ట్ కాలం: 1 సంవత్సరం
- విద్యార్హత: LL.B.
- నెలవారీ వేతనం: రూ.61,960
- అనుభవం: కనీసం 5 సంవత్సరాలు
- అవసరం: Immediate
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
విద్యార్హత
APCRDA Recruitment 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన/ప్రముఖ విద్యాసంస్థ నుంచి Bachelor’s Degree in Law (LL.B.) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థులకు Public Administration Laws, Land Laws, AP CRDA Act 2014, Land Pooling Scheme, Transfer of Property Act, Companies Act 2013, Indian Contract Act, Arbitration and Conciliation Act 1996, Public Procurement Rules, Labour Laws, RERA Act, Environmental Laws, Civil Procedure Code వంటి చట్టాలపై పని పరిజ్ఞానం ఉండాలి.
అనుభవం
ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, PPP లేదా Concession వ్యవహారాల్లో Development లేదా Infrastructure Authorityలో పనిచేసిన అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. అభ్యర్థులు కోర్టుల్లో నిర్వహించిన కేసుల వివరాలను సంవత్సరం వారీగా సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ బాధ్యతలు
Assistant Manager–Legalగా ఎంపికైన వారు APCRDA Legal Wingకు సహకరించాలి. ముఖ్యంగా కాంట్రాక్టులు, MoUలు, ఒప్పందాలు, PPP/EPC పత్రాలను పరిశీలించడం, భూసేకరణ మరియు Land Pooling Scheme వ్యవహారాల్లో సహాయం చేయడం, టెండర్ మరియు ప్రొక్యూర్మెంట్ పత్రాలను పరిశీలించడం, కోర్టు కేసులకు సంబంధించిన pleadings మరియు case summaries సిద్ధం చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి.
అలాగే లీగల్ రీసెర్చ్, భూమి టైటిల్ డాక్యుమెంట్ల పరిశీలన, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్, కోర్టు వ్యవహారాల్లో సహకారం, RERA మరియు పర్యావరణ అనుమతులకు సంబంధించిన చట్టపరమైన అంశాల పరిశీలన, కేసుల వివరాలను Legal MISలో నిర్వహించడం వంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది.
APCRDA Recruitment 2026: జీతము
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,960/- స్థిర వేతనం చెల్లిస్తారు. అభ్యర్థి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనం అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కాలం ఒక సంవత్సరం.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు APCRDA అధికారిక వెబ్సైట్ crda.ap.gov.inలోని Careers విభాగం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇతర మార్గాల్లో లేదా ఇతర వనరుల ద్వారా పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. APCRDA అధికారిక Careers పేజీలో Employment Notification No. 08/2026ను 25 ఆగస్టు 2026న ఇవ్వడం జరిగింది.
ముఖ్య గమనిక: పోస్టుల సంఖ్య ప్రాజెక్ట్ అవసరాలను బట్టి మారవచ్చు. పోస్టులను భర్తీ చేయడం లేదా మొత్తం నోటిఫికేషన్ను మార్చడం/రద్దు చేయడం వంటి హక్కులను APCRDA కలిగి ఉంది. కాబట్టి దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం మంచిది.
నోటిఫికేషన్ PDF లింకు :
వెబ్సైట్ లింకు:
మరిన్ని జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ ని subscribe చేస్కోండి. మా వెబ్సైట్ యొక్క అఫిసియల్ facebook పేజీ మరియు what’s app చానెల్ లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నోటిఫికేషన్ శ్ ఫ్రెష్ గా పోస్ట్ చేస్తాము.
