SBI Wealth Management Recruitment 2026: 207 ఉద్యోగాలు, రూ.97 లక్షల వరకు జీతం

SBI Wealth Management Recruitment 2026: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న బ్యాంకింగ్ మరియు వెల్త్ మేనేజ్‌మెంట్ రంగ నిపుణులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంచి అవకాశం ప్రకటించింది. SBI Wealth Management విభాగంలో వివిధ Specialist Cadre Officer పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Zonal Head, Regional Head, Relationship Manager-Team Lead, Investment Specialist, Investment Officer, VP Wealth, AVP Wealth వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

SBI Wealth Management Recruitment 2026

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 04 సెప్టెంబర్ 2026న ప్రారంభమై 25 సెప్టెంబర్ 2026న ముగుస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు SBI అధికారిక Careers వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Join Our WhatsApp Group
Join Now

SBI Wealth Management Recruitment 2026: ముఖ్యమైన వివరాలు

వివరాలుసమాచారం
సంస్థState Bank of India (SBI)
విభాగంWealth Management
రిక్రూట్‌మెంట్Specialist Cadre Officers
మొత్తం రెగ్యులర్ ఖాళీలు207
దరఖాస్తు విధానంOnline
దరఖాస్తు ప్రారంభ తేదీ04-09-2026
చివరి తేదీ25-09-2026
వయస్సుపోస్టును బట్టి 23 నుంచి 50 సంవత్సరాల వరకు
ఎంపిక విధానంShortlisting + Interview + CTC Negotiation
ఉద్యోగ స్వభావంContract Basis
అధికారిక వెబ్‌సైట్SBI Careers

SBI నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్‌లో Zonal Head (Retail)కి 1, Regional Headకి 5, Relationship Manager-Team Leadకి 24, Investment Specialistకి 9, Investment Officerకి 4, VP Wealthకి 91, AVP Wealthకి 73 రెగ్యులర్ ఖాళీలు ఉన్నాయి.

SBI Wealth Management Vacancy 2026

ఈ రిక్రూట్‌మెంట్‌లో అత్యధికంగా VP Wealth పోస్టులకు 91, AVP Wealth పోస్టులకు 73 ఖాళీలు ఉన్నాయి. Relationship Manager-Team Lead పోస్టులకు 24, Regional Head పోస్టులకు 5, Investment Specialist పోస్టులకు 9, Investment Officer పోస్టులకు 4, Zonal Head పోస్టుకు 1 ఖాళీ ఉంది.

అభ్యర్థులకు Circle preference ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. Relationship Manager-Team Lead, Investment Specialist, Investment Officer, VP Wealth, AVP Wealth పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మూడు వేర్వేరు Circles‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం Hyderabad Circleలో కూడా ఈ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.

SBI Wealth Management Recruitment 2026: అర్హత

  • విద్యార్హత పోస్టును బట్టి మారుతుంది. Zonal Head, Regional Head, Relationship Manager-Team Lead, VP Wealth, AVP Wealth పోస్టులకు సాధారణంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి Graduation ఉండాలి.
  • MBA (Banking/Finance/Marketing), CFP, CFA, NISM వంటి అదనపు అర్హతలకు కొన్ని పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
  • Investment Officer పోస్టుకు Finance, Accountancy, Business Management, Commerce, Economics, Capital Markets, Banking, Insurance లేదా Actuarial Science వంటి విభాగాల్లో PG Degree/PG Diploma లేదా CA/CFA వంటి ప్రొఫెషనల్ అర్హతలు అవసరం.

SBI Wealth Management Recruitment 2026: పోస్టుల వారీగా అనుభవం

ఈ SBI Wealth Management Jobs 2026 ముఖ్యంగా అనుభవం ఉన్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేశారు.

  • Zonal Head: కనీసం 15 సంవత్సరాల Wealth Management లేదా Retail Banking లేదా AMC sales లో అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు Relationship Managers గా గాని లేదా Team Leads వంటి పెద్ద టీమ్‌ను నడిపిన అనుభవం ఉండాలి.
  • Regional Head: కనీసం 12 సంవత్సరాల Relationship Management అనుభవం, అందులో 5 సంవత్సరాల Team Leadership అనుభవం ఉండాలి.
  • Relationship Manager Team Lead: కనీసం 8 సంవత్సరాల Relationship Management అనుభవం అవసరం.
  • Investment Officer: కనీసం 4 సంవత్సరాల Investment Advisor గాని Counsellor గాని Officer గాని Product Team లో అనుభవం అవసరం.
  • VP Wealth: ఈ యొక్క పోస్ట్ లకు Sales & Marketingలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • AVP Wealth: Sales & Marketingలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.

అనుభవాన్ని నిర్ధారించడానికి Experience Certificate, Appointment/Relieving Letters, Performance Appraisal Letters, Offer Letter, IT Returns లేదా ఇతర ప్రామాణిక పత్రాలను SBI పరిశీలించవచ్చు. ఆరు నెలల కంటే తక్కువ అనుభవాన్ని అర్హత కోసం పరిగణించరు.

SBI Wealth Management Recruitment 2026: Salary (జీతము)

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆకర్షణీయమైన జీతాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వారీగా సేలరీ ఇలా ఉంది:

  • Zonal Head: రూ.97 లక్షలు
  • Regional Head: రూ.66.40 లక్షలు
  • Relationship Manager-Team Lead: రూ.51.80 లక్షలు
  • Investment Specialist: రూ.44.50 లక్షలు
  • Investment Officer: రూ.27.10 లక్షలు
  • VP Wealth: రూ.44.70 లక్షలు
  • AVP Wealth: రూ.30.20 లక్షలు

CTC అభ్యర్థి అనుభవం, ప్రస్తుత వేతనం మరియు పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి చర్చించబడుతుంది. ఇందులో Fixed Payతో పాటు Performance Linked Pay మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

ఉద్యోగ కాలం(పదవి కాలం)

SBI Wealth Management Recruitment 2026 పోస్టులు Contract Basisపై ఉంటాయి. కాంట్రాక్ట్ వ్యవధి సాధారణంగా 5 సంవత్సరాలు. బ్యాంక్ నిర్ణయం మరియు సంబంధిత షరతుల ఆధారంగా మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది. ఇరుపక్షాల నుంచి రెండు నెలల నోటీసుతో కాంట్రాక్ట్‌ను ముగించే నిబంధన కూడా ఉంది.

ఎన్నిక విధానం

అభ్యర్థుల ఎంపికలో ముందుగా Shortlisting జరుగుతుంది. కనీస విద్యార్హత, అనుభవం ఉన్న ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలుస్తారని హామీ లేదు. SBI Shortlisting Committee అభ్యర్థుల అర్హత, అనుభవం మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

Shortlisting తర్వాత Personal Interview, Telephonic Interview లేదా Video Interviewలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రౌండ్లు నిర్వహించవచ్చు. SBI Wealth Management Recruitment 2026 Interviewకి 100 మార్కులు ఉంటాయి. అనంతరం అభ్యర్థితో CTC Negotiation నిర్వహిస్తారు. తుది Merit List ప్రధానంగా Interviewలో సాధించిన మార్కుల ఆధారంగా రూపొందించబడుతుంది.

SBI Wealth Management Recruitment 2026: అప్లికేషన్ ఫీజు వివరాలు

  • UR, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులకు రూ.750 అప్లికేషన్ ఫీజు మరియు Intimation Charges చెల్లించాలి.
  • SC, ST మరియు PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • అభ్యర్థులు ముందుగా SBI అధికారిక Careers వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ Current Openings విభాగాన్ని ఓపెన్ చేసి Advertisement No. CRPD/SCO/2026-27/23ను ఎంచుకోవాలి. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత Apply Online లింక్ ద్వారా దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తు సమయంలో తాజా ఫోటో, సంతకం, Resume, ID Proof, PAN Card, విద్యార్హత సర్టిఫికెట్లు, Experience Certificates, తాజా Salary Slip/Offer Letter, అవసరమైతే NOC మరియు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను Final Submit చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. Final Submission తర్వాత మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. SBI అధికారిక నోటిఫికేషన్ ప్రకారం చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన సమాచారం

SBI Wealth Management Recruitment 2026 సాధారణ Fresher ఉద్యోగం కాదు. Wealth Management, Banking, Investment, Sales, Relationship Management రంగాల్లో ఇప్పటికే అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా HNI/UHNI కస్టమర్లతో పనిచేసిన అనుభవం, Investment Productsపై అవగాహన, మంచి Communication Skills, Client Relationship Management మరియు Financial Market Knowledge ఉన్నవారికి ఈ పోస్టులు అనుకూలంగా ఉంటాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు తమ వయస్సు, విద్యార్హత, అనుభవం మరియు ఇతర అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌తో సరిపోల్చుకోవాలి. తప్పు సమాచారం లేదా తప్పుడు పత్రాలు సమర్పిస్తే అభ్యర్థిత్వం రద్దు కావడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని SBI స్పష్టం చేసింది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 04 సెప్టెంబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2026
అప్లికేషన్ ఫీజు: రూ.750 (UR/EWS/OBC)
SC/ST/PwBD: ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక: Shortlisting, Interview, CTC Negotiation

Join Our WhatsApp Group
Join Now

Important Links:

మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా వెబ్సైట్ ని subscribe చేస్కోండి, అలాగే మా యొక్క సోషల్ మీడియా facebook and what’s app channel లో జాయిన్ అవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top