IIT Tirupati Jobs 2026: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. IIT తిరుపతి Advertisement No. IITT/STAFFREC/01/2026 ద్వారా వివిధ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Group-A, Group-B, మరియు Group-C విభాగాల్లో మొత్తం 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. కావున ఎవరికైతే అర్హత అనేది ఉందో వారు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేస్కోండి.

ఇందులో అర్హత కలిగిన అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వారీగా విద్యార్హత, అనుభవం, వయోపరిమితి వేర్వేరుగా ఉన్నాయి.
పోస్టుల సంఖ్య
IIT Tirupati Jobs 2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
Group-A పోస్టులు – 6
- సూపరింటెండింగ్ ఇంజినీర్ – 1
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 1
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 2
- కౌన్సెలర్ – 1
- సెక్యూరిటీ ఆఫీసర్ – 1
Group-B పోస్టులు – 4
- హిందీ ట్రాన్స్‌లేటర్ – 1
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – CSE – 2
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – నెట్‌వర్క్ సెక్యూరిటీ – 1
Group-C పోస్టులు – 3
- జూనియర్ టెక్నీషియన్ – కెమికల్ ఇంజినీరింగ్ – 1
- జూనియర్ టెక్నీషియన్ – సిస్టమ్స్ – 1
- జూనియర్ టెక్నీషియన్ – CSE – 1
ఇందులో మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మికున్న అర్హతను బట్టి ఈ IIT Tirupati Jobs 2026 పోస్టులకు అప్లై చేసుకోండి.
విద్యార్హత
IIT Tirupati Jobs 2026 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. ముఖ్యమైన అర్హతలు కింది విదంగా ఉన్నాయి.
- సూపరింటెండింగ్ ఇంజినీర్: సివిల్ లేదా ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, కనీసం 55% మార్కులు మరియు సంబంధిత అనుభవం అవసరం.
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: CSE లేదా ITలో BE గాని B.Tech గాని M.Sc గాని MCA గాని లేదా ME గాని M.Tech గాని Ph.D.తో పాటు పోస్టుకు నిర్దేశించిన సంబంధిత అనుభవం అనేది ఉండాలి.
- అసిస్టెంట్ రిజిస్ట్రార్: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, సంబంధిత అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా అకౌంటింగ్ లేదా అకడమిక్ లేదా ఆడిట్ తదితర విభాగాల్లో అనుభవం అవసరం.
- కౌన్సెలర్: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, కనీసం 55% మార్కులు, 5 సంవత్సరాల క్లినికల్ అనుభవం మరియు చెల్లుబాటు అయ్యే RCI రిజిస్ట్రేషన్ అవసరం.
- సెక్యూరిటీ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత సెక్యూరిటీ అనుభవం మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
- హిందీ ట్రాన్స్‌లేటర్: హిందీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్ డిగ్రీ, కనీసం 55% మార్కులు మరియు 2 సంవత్సరాల అనువాద అనుభవం అవసరం.
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: CSE లేదా IT లేదా ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో BE లేదా B.Tech లేదా M.Sc లేదా MCA లేదా సంబంధిత B.Sc గాని BCA గాని డిప్లొమా అర్హతతో అనుభవం అవసరం.
- జూనియర్ టెక్నీషియన్: పోస్టును బట్టి BE గాని B.Tech, లేదా B.Sc గాని BCA, డిప్లొమా లేదా ITI అర్హతతో పాటు సంబంధిత అనుభవం అవసరం.
IIT Tirupati Jobs 2026 పోస్టులకు అప్లై చేసే వారికీ అన్ని విద్యార్హతలు కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉండాలి.
వయసు
పోస్టుల వారీగా గరిష్ట వయోపరిమితి వేర్వేరుగా ఉంది.
- సూపరింటెండింగ్ ఇంజినీర్ – 50 సంవత్సరాలు వయసు
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 45 సంవత్సరాలు
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 45 సంవత్సరాలు
- కౌన్సెలర్ – 45 సంవత్సరాలు
- సెక్యూరిటీ ఆఫీసర్ – 45 సంవత్సరాలు
- హిందీ ట్రాన్స్‌లేటర్ – 35 సంవత్సరాలు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 35 సంవత్సరాలు
- జూనియర్ టెక్నీషియన్ – 27 సంవత్సరాలు
వయస్సును 30 సెప్టెంబర్ 2026 నాటికి లెక్కిస్తారు. SC/ST, OBC-NCL, PwBD, Ex-Servicemen తదితర వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం
IIT తిరుపతి ఉద్యోగాలకు పోస్టును బట్టి 7వ పే కమిషన్ Pay Level ప్రకారం జీతం ఉంటుంది.
- సూపరింటెండింగ్ ఇంజినీర్ – రూ.1,23,100 – రూ.2,15,900
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – రూ.78,800 – రూ.2,09,200
- అసిస్టెంట్ రిజిస్ట్రార్/కౌన్సెలర్/సెక్యూరిటీ ఆఫీసర్ కు – రూ.56,100 – రూ.1,77,500
- హిందీ ట్రాన్స్‌లేటర్/జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – రూ.35,400 – రూ.1,12,400
- జూనియర్ టెక్నీషియన్ – రూ.25,500 – రూ.81,100
ఉద్యోగ స్థలం
ఈ ఉద్యోగాలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IIT Tirupati), తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు
IIT Tirupati Jobs 2026 అప్లై చేసే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
| గ్రూప్ | అప్లికేషన్ ఫీజు | ప్రాసెసింగ్ ఫీజు |
|---|---|---|
| Group-A | రూ.500 | రూ.200 |
| Group-B | రూ.300 | రూ.200 |
| Group-C | రూ.200 | రూ.200 |
SC/ST/Ex-Servicemen, మహిళలు, Transgender మరియు PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే ప్రతి పోస్టుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం
ఈ IIT Tirupati Jobs 2026 ఉద్యోగాలకు పోస్టును బట్టి ఎంపిక విధానం ఉంటుంది.
Group-A పోస్టులకు:
స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని సార్లు రెండింటి ద్వారా ఎంపిక చేయవచ్చు.
Group-B మరియు Group-C పోస్టులకు:
- Level-I – Objective Based Test ఉంటుంది.
- Level-II – Descriptive Written Test ఉంటుంది.
- Level-III – Skill Test మరియు Trade Test ఉంటుంది.
IIT Tirupati Jobs 2026 పోస్టులకు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే IIT తిరుపతి విద్యార్హతలు, అనుభవం మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా అప్లికేషన్ సమర్పించాలి.
దరఖాస్తు సమయంలో విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, బర్త్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికెట్, అవసరమైతే NOC మరియు అనుభవ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. హార్డ్ కాపీని వెంటనే IIT తిరుపతికి పంపాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ: 31 ఆగస్టు 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 31 ఆగస్టు 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026
- వయస్సు/అనుభవం లెక్కించే తేదీ: 30 సెప్టెంబర్ 2026
ఈ సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టుకు డిప్యూటేషన్ ద్వారా దరఖాస్తు చేసే అభ్యర్థులకు అదనపు నిబంధనలు వర్తిస్తాయి.
ముఖ్యమైన లింక్స్
అధికారిక నోటిఫికేషన్:
ఆన్‌లైన్ దరఖాస్తు/రిక్రూట్‌మెంట్ పోర్టల్:
ముఖ్య గమనిక: పోస్టుల వారీగా విద్యార్హత, అనుభవం, వయస్సు మరియు ఇతర అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి తమ అర్హతలను చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయండి..
