RRB Paramedical Recruitment 2026: ఏవరైతే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRBs) తాజాగా CEN No. 05/2026 ద్వారా వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 590 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు 15/09/ 2026 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ 14/10/2026. కావున అర్హత కలిగిన వారు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఎన్ని పోస్టులు?
RRB Paramedical Recruitment 2026 నోటిఫికేషన్‌లో మొత్తం 590 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు:
| పోస్టులు | ఖాళీలు |
|---|---|
| Nursing Superintendent | 365 |
| Dialysis Technician | 1 |
| Health & Malaria Inspector Gr-II | 43 |
| Audiologist & Speech Therapist | 1 |
| Pharmacist (Entry Grade) | 118 |
| Radiographer X-Ray Technician | 25 |
| ECG Technician | 4 |
| Optometrist | 2 |
| Lab Assistant Grade-II | 31 |
మొత్తం: 590 పోస్టులు.
విద్యార్హత
- GNM
- B.Sc Nursing
- B.Sc
- Pharmacy
- Radiography
- ECG Technology
- Optometry
- DMLT
RRB Paramedical Recruitment 2026 లో పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. పైన ఉన్నటువంటి విద్య అర్హతలు అవసరం.
వయసు
RRB Paramedical Recruitment 2026 పోస్టులకు వయస్సును 01-01-2027 నాటికి లెక్కిస్తారు. పోస్టును బట్టి కనీస వయస్సు 18 నుంచి 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంది. SC/STలకు 5 సంవత్సరాలు, OBC NCLకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇతర కేటగిరీలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతం
పోస్టును బట్టి 7వ CPC Pay Level ప్రకారం ప్రారంభ జీతం ₹21,700 నుంచి ₹44,900 వరకు ఉంటుంది. దీనికి రైల్వే నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
జాబ్ లొకేషన్
RRB Paramedical Recruitment 2026 లో ఈ పోస్టులు వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరియు రైల్వే జోన్స్ పరిధిలో ఉన్నాయి. అభ్యర్థులు ఒక RRBను ఎంచుకుని, అందులో అందుబాటులో ఉన్న పోస్టులు/రైల్వే జోన్లకు తమ ప్రాధాన్యతలను ఇవ్వాలి.
అప్లికేషన్ ఫీజు
- ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు: ₹500 పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
- మిగతా వారు అంటే SC/ST, Ex-Servicemen, PwBD, మహిళలు, ట్రాన్స్ జండర్, Minorities, EBC అభ్యర్థులు: ₹250 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
CBTకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఫీజులో కొంత భాగం రీఫండ్ అవుతుంది.
ఎంపిక విధానం
ఈ యొక్క జాబ్స్ కు అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా ఉండే ఎన్నిక విదానం,
- కంప్యూటరు టెస్ట్ (CBT)
- డాక్యుమెంట్ వెరీఫికేశన్
- మెడికల్ ఎక్సామ్
- ఎంపానెల్మెంట్
CBTలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. Professional Ability నుంచి 70 ప్రశ్నలు, General Awareness 10, Arithmetic/Reasoning 10, General Science 10 ప్రశ్నలు ఉంటాయి. అలాగే తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ యొక్క పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా RRB Account లో వ్యక్తిగత మొబైల్ నంబర్ మరియు Email IDతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పోస్టు యొక్క ప్రాధాన్యతలు ఎంచుకుని, అవసరమైన వివరాలు నమోదు చేసి, Live Photograph, Signature వంటి వివరాలను సమర్పించి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2026
- ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 16-10-2026
- Application Modification తేదీ: 17-10-2026 నుంచి 26-10-2026
- Scribe వివరాల నమోదు: 27-10-2026 నుంచి 31-10-2026
అధికారిక లింక్స్
Official RRB Website:
Official Notification PDF:
గమనిక: అభ్యర్థులు ఒకే RRBకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు సమర్పిస్తే దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది.
