Latest APPSC Group 1 Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ లో 166 ఉద్యోగాలు | అప్లై చేయండి

APPSC Group 1 Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Group-I Services Recruitment 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 166 ప్రొవిజనల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ 15 సెప్టెంబర్ 2026న విడుదలైంది. కావున అర్హులైన వారు ఈ యొక్క నోటిఫికేషన్ కు 06-10-2026 నుండి అప్లై చేసుకోండి

Join Our WhatsApp Group
Join Now
APPSC Group 1 Recruitment 2026

ఎన్ని పోస్టులు?

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 166 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, DSP, జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ తదితర పోస్టులు ఉన్నాయి.

పోస్టుఖాళీలు
డిప్యూటీ కలెక్టర్12
అసిస్టెంట్ కమిషనర్ – స్టేట్ టాక్స్ 14
DSP (సివిల్ )36
DSP (కమ్యూనికేషన్స్ )3
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 14
రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1
డిప్యూటీ రిజిస్ట్రార్ 16
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -212
అసిస్టెంట్ ట్రెజరీ / అక్కౌంట్స్ ఆఫీసర్ 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ 3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 15
డివిసనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35

విద్యార్హత

  • APPSC Group 1 Recruitment 2026 లో Group-I పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెయిన్ గా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
  • అయితే DSP Communications పోస్టుకు Electronics & Telecommunication లేదా Radio Engineeringలో B.E. లేదా B.Tech వంటి నిర్దిష్ట అర్హత అవసరం. ఖచ్చితమైన విద్యార్హతలు పోస్టుల వారీగా డిటైల్డ్ నోటిఫికేషన్‌లో ఉంటాయి.

వయసు

APPSC Group 1 Recruitment 2026 నోటిఫికేషన్ లో అభ్యర్థుల వయోపరిమితి సడలింపులు పోస్టుల వారీగా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 18 సంవత్సరాలు నుండి 44 వరకు ఉంది, వయసు మరియు ఇతర అర్హతలకు డిటైల్డ్ నోటిఫికేషన్లో 06-10-2026 న తెలుస్తుంది.

జీతం

APPSC Group 1 Recruitment 2026 పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది. కింద ఇవ్వబడిన సేలరీ అనేది ఉంటుంది.

సేలరీ 54,060 నుండి 1,54,980 వరకు ఉంటుంది.

జాబ్ లొకేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలకు పోస్టింగ్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజు మరియు ఇతర చార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలను డిటైల్డ్ నోటిఫికేషన్లో 06-10-2026 ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం

APPSC Group-I ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా:

  1. Screening Test (Preliminary)
  2. Main Written Examination
  3. Personal Interview ఉంటాయి.

స్క్రీనింగ్ టెస్ట్ ను ఆఫ్‌లైన్ OMR విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్ అనే రెండు పేపర్లు ఉంటాయి. ముక్యంగా చెప్పాలంటే 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇది జనరల్ గా ప్రతి ఎక్సామ్ లో ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

APPSC Group 1 Recruitment 2026 లో అప్లై చేసే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

  1. APPSC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  2. అవసరమైన వివరాలతో Online Application పూర్తి చేయాలి.
  3. విద్యార్హతలు, సర్టిఫికెట్ల వివరాలు నమోదు చేయాలి.
  4. అవసరమైన ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను Submit చేయాలి.
  5. అప్లై చేసే ముందు Application PDFను చెక్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: 15-09-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06-10-2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 27-10-2026 వరకు
  • డిటైల్డ్ నోటిఫికేషన్: 06-10-2026లోపు వస్తుంది.
Join Our WhatsApp Group
Join Now

అధికారిక లింక్స్

APPSC అధికారిక వెబ్‌సైట్:

APPSC Recruitment Notifications:

గమనిక: ఖాళీల సంఖ్య ప్రొవిజనల్‌గా ఇవ్వబడింది. డిపార్ట్‌మెంట్ల నుంచి ఖాళీల నిర్ధారణ అనంతరం మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక డిటైల్డ్ నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top