Bank of Baroda Recruitment 2026: 1,100 ఉద్యోగాలు.. డిగ్రీ, CA అర్హతతో భారీ అవకాశం

Bank of Baroda Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ Bank of Baroda (BOB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి వివిధ విభాగాల్లో మొత్తం 1,100 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది.

Bank of Baroda Recruitment 2026

Bank of Baroda Recruitment 2026: ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రధానంగా Wealth Executive మరియు Credit Analyst – Corporate & Institutional Credit (C&IC) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి, పని అనుభవం, సర్టిఫికేషన్లు తప్పనిసరిగా ఉండాలి.

Join Our WhatsApp Group
Join Now

Bank of Baroda అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026 వరకు. ఇ పోస్టులు మన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఉన్నాయి.

Bank of Baroda Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

వివరాలుసమాచారం
సంస్థBank of Baroda
నోటిఫికేషన్ నంబర్BOB/HRM/REC/ADVT/2026/17
మొత్తం ఖాళీలు1,100
Wealth Executive పోస్టులు1,000
Credit Analyst – C&IC పోస్టులు100
దరఖాస్తు ప్రారంభ తేదీ04 సెప్టెంబర్ 2026
దరఖాస్తు చివరి తేదీ24 సెప్టెంబర్ 2026
ఉద్యోగ విధానంRegular Basis
పోస్టింగ్భారతదేశంలో ఎక్కడైనా
దరఖాస్తు విధానంOnline

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను బ్యాంక్ అవసరాన్ని బట్టి దేశంలోని ఏ బ్రాంచ్ లోనైనా నియమించవచ్చు.

Bank of Baroda Recritment 2026 Vacancy

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

1. Wealth Executive – 1,000 పోస్టులు

గ్రేడ్: JMG/S-I

వయస్సు: 22 నుంచి 32 సంవత్సరాలు.

విద్యార్హత: ఏదైనా విభాగంలో Graduation పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు కింది సర్టిఫికేషన్లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి:

  • Insurance Institute of India నుంచి IC 38 Certification
  • NISM Series V-A – Mutual Fund Distributors Certification
  • NISM Series XXI-A – Portfolio Management Services (PMS) Distributors Certification
  • NISM Series V-D – Mutual Fund – Specialised Investment Fund Distributors Certification

అదనంగా Managementలో 2 సంవత్సరాల Full-time Post Graduate Degree లేదా Diploma లేదా MBA (Finance/Marketing/Banking) ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

అలాగే Wealth Products Salesలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులను కోరుతున్నారు. ఈ అనుభవం Public Sector Banks, Private Sector Banks, Foreign Banks, Broking లేదా Securities Firms, Asset Management Companies లేదా Wealth Management Companies వంటి సంస్థల్లో ఉండాలి.

2. Credit Analyst – C&IC – 100 పోస్టులు

గ్రేడ్: MMG/S-II

వయస్సు: 21 నుంచి 33 సంవత్సరాలు.

ఈ పోస్టుకు ఏదైనా విభాగంలో Graduationతో పాటు Chartered Accountant (CA) అర్హత తప్పనిసరి.

అభ్యర్థికి Scheduled Commercial Bankలో కనీసం 1 సంవత్సరం Banking Experience ఉండాలి. Corporate Creditలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

జీతం ఎంత?

Bank of Baroda Recruitment 2026 లో పోస్టును బట్టి ఆకర్షణీయమైన పే స్కేల్ అందుబాటులో ఉంది.

Wealth Executive (JMG/S-I):

ప్రాథమిక జీతం రూ.48,480 నుంచి ప్రారంభమై, పే స్కేల్ ప్రకారం రూ.85,920 వరకు ఉంటుంది.

Credit Analyst – C&IC (MMG/S-II):

ప్రాథమిక జీతం రూ.64,820 నుంచి ప్రారంభమై రూ.93,960 వరకు ఉంటుంది.

ఇవికాకుండా బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ allowances, perquisites మరియు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

వయసు సడలింపు

Bank of Baroda Recruitment 2026: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు upper age limitలో సడలింపు ఉంటుంది.

  • SC/ST: 5 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • PwBD: కేటగిరీని బట్టి 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.
  • Ex-Servicemen: నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది

Bank of Baroda Recruitment 2026 లో రిజర్వేషన్ ప్రయోజనం పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లను సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు

Bank of Baroda Recruitment 2026కు కేటగిరీని బట్టి application fee ఉంటుంది.

  • General/EWS/OBC: రూ.850 + Payment Gateway Charges చెల్లించాలి.
  • SC/ST/PwBD/ESM/Women: రూ.175 + Payment Gateway Charges చెల్లించాలి.

ఈ ఫీజు Non-refundable. దరఖాస్తు ప్రక్రియలోనే Online Payment ద్వారా ఫీజు చెల్లించాలి.

ఎంపిక చేసే విదానం ఎలా ఉంటుంది?

Bank of Baroda Recruitment 2026 నోటిఫికేషన్ ప్రకారం selection processలో అవసరాన్ని బట్టి Application Scrutiny, Online Test, Psychometric Test, Group Discussion మరియు Personal Interview వంటి దశలు ఉండవచ్చు.

Online Test నిర్వహిస్తే మొత్తం 120 ప్రశ్నలు – 120 మార్కులు, పరీక్ష సమయం 120 నిమిషాలు.

ఈ పరీక్షలో వేటి గురించి ప్రశ్నలు ఉంటాయి:

  • English Language నుండి – 20 ప్రశ్నలు
  • Reasoning Ability మరియు Quantitative Aptitude నుండి – 20 ప్రశ్నలు
  • General లేదా Economic & Banking Awareness లో – 20 ప్రశ్నలు
  • Professional Knowledge లో – 60 ప్రశ్నలు

Professional Knowledge విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 0.25 మార్కు negative marking ఉంటుంది.

అయితే Online Test నిర్వహించాలా లేదా అనే నిర్ణయం బ్యాంకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే తాజా updatesను తప్పనిసరిగా పరిశీలించాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

Bank of Baroda Recruitment 2026కు అర్హత ఉన్న అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సాధారణంగా క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:

  • Resume
  • 10వ తరగతి మార్కుల మెమో/జనన తేదీ ఆధారం
  • Graduation certificates/marksheets
  • సంబంధిత Professional Certification
  • Work Experience Certificates
  • Caste/Category Certificate, వర్తిస్తే
  • PwBD Certificate, వర్తిస్తే
  • Photograph
  • Signature
  • Left Thumb Impression
  • Hand-written Declaration

బ్యాంకు సూచించిన file size, format మరియు image dimensions ప్రకారం పత్రాలను upload చేయాలి.

Probation Period మరియు Service Bond

ఎంపికైన అభ్యర్థులు బ్యాంకులో చేరిన తేదీ నుంచి 12 నెలల probation periodలో ఉంటారు.

అదేవిధంగా ఈ ఉద్యోగాలకు Service Bond కూడా ఉంటుంది. JMG/S-Iలో ఎంపికైన అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాలు బ్యాంకులో సేవ చేయాలి. అంతకుముందు ఉద్యోగం విడిచిపెడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి రావచ్చు.

MMG/S-II అభ్యర్థులకు కూడా 3 సంవత్సరాల service obligation ఉంటుంది. ముందుగా ఉద్యోగం విడిచిపెడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి రావచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 04 సెప్టెంబర్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24 సెప్టెంబర్ 2026

చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు పూర్తి అయిన తర్వాత generated application form మరియు payment receiptను జాగ్రత్తగా ఉంచుకోండి.

Join Our WhatsApp Group
Join Now

Official Links:

ముఖ్యమైన సూచన

అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తమ విద్యార్హత, వయస్సు, సర్టిఫికేషన్లు మరియు పని అనుభవం నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు సరిపోతున్నాయో లేదో పరిశీలించాలి.

ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ applications సమర్పిస్తే చివరిగా పూర్తయిన valid application మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే తప్పు సమాచారం లేదా తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలిస్తే ఏ దశలోనైనా candidature రద్దు చేయవచ్చు.


మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా యొక్క వెబ్సైట్ ఫాలో అవ్వండి, అలాగే మా సోషల్ మీడియా అఫిసియల్ పేజీ ని (facebokk మరియు what’s app) ఫాలో అవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top