India Post GDS Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 23,757 పోస్టులు – పూర్తి వివరాలు

India Post GDS Recruitment 2026: ఇండియా పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి GDS Online Engagement Schedule-II, July-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM), Dak Sevak పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Join Our WhatsApp Group
Join Now
India Post GDS Recruitment 2026

ఎన్ని పోస్టులు?

ఈ India Post GDS Recruitment 2026 Schedule-IIకు మొత్తం 23,757 ఖాళీలు ఉన్నట్లు రిక్రూట్‌మెంట్ వివరాలు సూచిస్తున్నాయి. పోస్టులు BPM, ABPM, Dak Sevak కేటగిరీల్లో వివిధ పోస్టల్ సర్కిళ్లు/డివిజన్లలో ఉన్నాయి. అయితే అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న డివిజన్ పోస్టు కేటగిరీ వారీ ఖాళీలను అధికారిక GDS పోర్టల్‌లో తప్పనిసరిగా చెక్ చేయాలి.

విద్యార్హత (Eligibility)

  • India Post GDS Recruitment 2026 కు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా 10వ తరగతిలో Mathematics మరియు Englishలో పాస్ మార్కులు ఉండాలి.
  • అదేవిధంగా దరఖాస్తు చేస్తున్న పోస్టల్ సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషను కనీసం 10వ తరగతి వరకు చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు స్థానిక భాషగా తెలుగును నోటిఫికేషన్ పేర్కొంది.
  • ఇతర అర్హతల్లో కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం మరియు తగిన జీవనోపాధి మార్గం ఉండటం అవసరం.

వయసు (Age)

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వయసును ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ నాటికి లెక్కిస్తారు.

India Post GDS Recruitment 2026 పోస్టులు రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

  • SC/ST – 5 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • OBC – 3 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • PwBD – 10 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • PwBD + OBC – 13 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • PwBD + SC/ST – 15 సంవత్సరాలు వరకు ఉంటుంది.
  • EWS – వయో సడలింపు లేదు.

జీతం (Salary)

GDS ఉద్యోగులకు సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ కాకుండా Time Related Continuity Allowance (TRCA) చెల్లిస్తారు.

  • BPM: ₹12,000 – ₹29,380
  • ABPM/Dak Sevak: ₹10,000 – ₹24,470

TRCAపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం Dearness Allowanceతో పాటు GDSలకు కొన్ని ఇతర అలవెన్సులు, సామాజిక భద్రత ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఉద్యోగ వివరలు (Job Details)

India Post GDS Recruitment 2026 రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు ఇండియా పోస్ట్‌కు సంబంధించిన పోస్టల్ కార్యకలాపాల్లో పనిచేయాలి.

  • BPM (Branch Postmaster) పోస్టులో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, మెయిల్ డెలివరీ, India Post Payments Bank (IPPB) సేవలు, కస్టమర్ సర్వీసులు, పోస్టల్ ఉత్పత్తుల ప్రమోషన్ వంటి బాధ్యతలు ఉంటాయి. BPMగా ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణకు అవసరమైన వసతి సౌకర్యాన్ని స్వయంగా ఏర్పాటు చేయాలి.
  • ABPM (Assistant Branch Postmaster) పోస్టులో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ, ఇంటింటికీ మెయిల్ డెలివరీ, IPPB లావాదేవీలు, BPMకు సహాయం చేయడం వంటి పనులు ఉంటాయి.
  • Dak Sevak పోస్టులో పోస్టాఫీసులు, సార్టింగ్ లేదా మెయిల్ ఆఫీసులు, డెలివరీ సెంటర్లలో మెయిల్స్, పార్సెల్స్ నిర్వహణ, డెలివరీ, పోస్టల్ కార్యకలాపాలకు సహకరించడం వంటి విధులు ఉంటాయి.

జాబ్ లొకేషన్

ఈ GDS పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లు, డివిజన్లు మరియు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. BPM, ABPM, Dak Sevak పోస్టులకు స్థానిక ప్రాంతం లేదా పోస్టల్ డివిజన్ ఆధారంగా పోస్టింగ్ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉన్న డివిజన్ మరియు పోస్టులకు ప్రాధాన్యతలు ఇవ్వాలి.

అప్లికేషన్ ఫీజు (Application Fees)

అప్లికేషన్ ఫీజు ₹100.

అయితే మహిళా అభ్యర్థులు, SC, ST, PwBD మరియు Transwomen అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అర్హత ఉన్న ఇతర అభ్యర్థులు క్రెడిట్/డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించవచ్చు. చెల్లించిన ఫీజు సాధారణంగా తిరిగి చెల్లించబడదు.

ఎంపిక విధానం (Selection Process)

  • ఈ రిక్రూట్‌మెంట్‌లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్ లు లేవు. అభ్యర్థులను 10వ తరగతి మార్కుల ఆధారంగా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • 10వ తరగతి మార్కులను శాతంగా మార్చి, నాలుగు దశాంశాల వరకు మెరిట్ తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో Physical Document Verificationకు హాజరు కావాలి. అనంతరం అవసరమైన ప్రీ ఎంగేజ్‌మెంట్ ఫార్మాలిటీస్, 3 రోజుల ప్రాథమిక శిక్షణ తదితర ప్రక్రియలు పూర్తి చేయాలి.

ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)

India Post GDS Recruitment 2026 పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా One Time Registration (OTR) పూర్తి చేసి, అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి.

  1. అధికారిక GDS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
  2. మొబైల్ నంబర్, ఈమెయిల్ ద్వారా OTP వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
  3. వ్యక్తిగత, 10వ తరగతి విద్యా వివరాలు నమోదు చేయాలి.
  4. అర్హత ఉన్న డివిజన్ మరియు పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  5. తాజా ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  6. అవసరమైన వారు ₹100 ఫీజు చెల్లించాలి.
  7. అప్లికేషన్‌ను Preview చేసి Final Submit చేయాలి.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • నోటిఫికేషన్ తేదీ: 20 ఆగస్టు 2026
  • One Time Registration ప్రారంభం: 31 ఆగస్టు 2026
  • One Time Regitration చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2026, సాయంత్రం 5:00 గంటల వరకు
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 2 సెప్టెంబర్ 2026
  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2026, సాయంత్రం 5:00 గంటల వరకు
  • Correction Window: 23–24 సెప్టెంబర్ 2026, సాయంత్రం 5:00 గంటల వరకు.
Join Our WhatsApp Group
Join Now

అధికారిక లింక్స్ (India Post GDS Recruitment 2026 Official Links)

అధికారిక నోటిఫికేషన్ PDF:

ఆన్‌లైన్ దరఖాస్తు / GDS అధికారిక పోర్టల్:

ముఖ్య గమనిక: అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, స్థానిక భాష, డివిజన్ వారీ పోస్టులు మరియు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. రిజిస్ట్రేషన్ ఒక్కటే అప్లికేషన్ కాదు; OTR పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను కూడా Submit చేయాలి.


మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా Website ని ఫాలో అవ్వండి. అలాగే మా whats app చానెల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top