NFC Apprentice Recruitment 2026: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC), హైదరాబాద్ నుంచి 2026-27 సంవత్సరానికి ITI Trade Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ITI పాసైన అభ్యర్థులకు ఇది మంచి Apprenticeship అవకాశం. మొత్తం 432 Apprentice పోస్టులను వివిధ ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు NFC, హైదరాబాద్‌లో ఒక సంవత్సరం పాటు Apprenticeship Training ఇవ్వబడుతుంది.

ఎన్ని పోస్టులు?
NFC Apprentice Recruitment 2026 ద్వారా మొత్తం 432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
| ట్రేడ్ | పోస్టులు |
|---|---|
| Fitter | 133 |
| Turner | 51 |
| Electrician | 58 |
| Machinist | 24 |
| Attendant Operator (Chemical Plant) / Chemical Plant Operator | 13 |
| Instrument Mechanic | 15 |
| Electronics Mechanic | 26 |
| Laboratory Assistant (Chemical Plant) | 6 |
| Motor Mechanic (Vehicle) | 3 |
| Draughtsman (Mechanical) | 1 |
| Computer Operator & Programming Assistant (COPA) | 65 |
| Diesel Mechanic | 3 |
| Carpenter | 5 |
| Plumber | 5 |
| Welder | 24 |
| Stenographer (English) | 0 |
| మొత్తం | 432 |
NFC Apprentice Recruitment 2026 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం కార్యాలయ అవసరాలను బట్టి ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
విద్యార్హత (Eligibility)
ఈ Apprentice పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:
- 10వ తరగతి/SSC పాస్ అయి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ అయి ఉండాలి.
- ITIకి సంబంధించిన National Trade Certificate (NTC) కలిగి ఉండాలి.
- అభ్యర్థులు NAPS Apprenticeship Portalలో రిజిస్టర్ అయి ఉండాలి.
- ఇప్పటికే ఏదైనా Government, PSU లేదా Private Organizationలో Apprenticeship చేసిన వారు/చేస్తున్న వారు అర్హులు కాదు.
- Post-Graduation చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కాదు.
వయసు (Age)
NFC Apprentice Recruitment 2026కు దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి:
- General Candidates – 25 సంవత్సరాలు
- OBC Candidates – 28 సంవత్సరాలు
- SC/ST Candidates – 30 సంవత్సరాలు
రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలు Apprenticeship Act, 1961 మరియు Apprenticeship Rules ప్రకారం వర్తిస్తాయి.
జీతం / స్టైపెండ్ (Salary or Stipand)
ఇది సాధారణ రెగ్యులర్ ఉద్యోగం కాకుండా Apprenticeship Training కాబట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైపెండ్ అందుతుంది.
- Fitter, Turner, Electrician, Machinist తదితర సంబంధిత ట్రేడులకు: నెలకు ₹11,040
- COPA మరియు నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని ట్రేడులకు: నెలకు ₹10,560
Apprenticeship వ్యవధి 1 సంవత్సరం. స్టైపెండ్ Apprenticeship Act నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
జాబ్ వివరణ (About Job)
- NFC Apprenticeగా ఎంపికైన అభ్యర్థులకు వారు ఎంచుకున్న ITI ట్రేడ్‌కు సంబంధించిన ప్రాక్టికల్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అందిస్తారు. Fitter, Electrician, Machinist, Turner, Electronics Mechanic, COPA వంటి విభిన్న విభాగాల్లో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
- Training పూర్తైన తర్వాత అభ్యర్థులు Trade Testకు హాజరు కావాలి. Trade Testలో అర్హత సాధించిన వారికి Apprenticeship Portal ద్వారా DGT తరఫున National Apprenticeship Certificate (NAC) అందించబడుతుంది.
ముఖ్య గమనిక: NFC Apprentice Recruitment 2026 పోస్టులకు Apprenticeship పూర్తి చేసిన తర్వాత NFCలో శాశ్వత ఉద్యోగం ఇస్తారనే హామీ లేదు. Apprenticeship ద్వారా NFCలో ఉద్యోగ హక్కు లభించదని నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది.
జాబ్ లొకేషన్
ఎంపికైన అభ్యర్థులు Nuclear Fuel Complex (NFC), హైదరాబాద్, తెలంగాణలో Apprenticeship Training చేయాలి.
అప్లికేషన్ ఫీజు (Application Fees)
NFC Apprentice Recruitment 2026 నోటిఫికేషన్‌లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు పేర్కొనలేదు. కాబట్టి అభ్యర్థులు అధికారిక NAPS Portal ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం (Selection Process)
NFC Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ కి సంబందించిన ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక Walk-in Interview ద్వారా జరుగుతుంది.
ముందుగా అభ్యర్థులు NAPS Portalలో NFC కోసం దరఖాస్తు చేయాలి. అనంతరం NFC Selection Committee దరఖాస్తులను పరిశీలించి, ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థులను Walk-in Interview ద్వారా ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం Email ద్వారా అందిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)
అభ్యర్థులు NAPS Portal – apprenticeshipindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
- ముందుగా NAPS Portalలో Registration చేసుకోవాలి.
- Email ID మరియు Passwordతో Login అవ్వాలి.
- Apprenticeship Opportunities అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- Search by Establishment Nameలో Nuclear Fuel Complex-E11153600013 అని సెర్చ్ చేయాలి.
- NFC, Hyderabadలో అందుబాటులో ఉన్న ట్రేడుల జాబితా కనిపిస్తుంది.
- మీ ITI ట్రేడ్‌కు సంబంధించిన Apply బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
- అవసరమైన సర్టిఫికెట్లను Portalలో Upload చేయాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నోటిఫికేషన్ తేదీ: 27 ఆగస్టు 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16 సెప్టెంబర్ 2026
- Training ప్రారంభ తేదీ: ఎంపికైన అభ్యర్థులకు Email ద్వారా తెలియజేస్తారు.
NFC Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ చివరి తేదీ తర్వాత వచ్చిన లేదా incomplete applicationsను పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
అవసరమైన డాక్యుమెంట్లు
Document Verification సమయంలో అభ్యర్థులు 10వ తరగతి మార్కుల మెమో, ITI మార్క్‌షీట్ మరియు National Trade Certificate, అవసరమైతే Caste లేదాDisability Certificate, Aadhaar Card, Police Verification Certificate, Bank Account/Passbook, Online Application Hard Copy, సంబంధిత డాక్యుమెంట్ల ఫోటోకాపీలు మరియు రెండు తాజా Passport Size Photos తీసుకురావాలి. ఎంపికైన అభ్యర్థులు Medical Fitness Certificate కూడా సమర్పించాలి.
అధికారిక లింక్స్ (Official Links)
NFC Official Website:
NAPS Official Portal:
Official NFC Apprentice Notification PDF:
ముఖ్య సూచన: దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలు, అర్హతలు మరియు డాక్యుమెంట్ల వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.
మరిన్ని జాబ్ నోటిఫికేషన్ updates కోసం మా website (jobshubtelugu. in) ని ఫాలో చేయండి. మరియు whats app చానెల్ లో జాయిన్ అవ్వండి.
