GMC Mahabubnagar Jobs 2026: తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని Government Medical College, Mahabubnagar నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ మెడికల్ విభాగాల్లో Professor, Associate Professor, Assistant Professor, Tutor, Junior Resident పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 149 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు Walk-in Interview ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కింద చూడండి.

మొత్తం ఎన్ని పోస్టులు?
GMC Mahabubnagar Jobs 2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
| పోస్టు | ఖాళీలు |
|---|---|
| Professor | 8 |
| Associate Professor | 19 |
| Assistant Professor | 62 |
| Tutor | 10 |
| Junior Resident | 50 |
| మొత్తం | 149 |
Professor, Associate Professor, Assistant Professor పోస్టులు, మరియు Anatomy, Physiology, Biochemistry, Pharmacology, Pathology, General Medicine, Pediatrics, General Surgery, Orthopedics, ENT, Ophthalmology, OBG, Anesthesiology, Radiodiagnosis, Emergency Medicine, Transfusion Medicine తదితర విభాగాల్లో ఉన్నాయి.
విద్యార్హత (Eligibility)
- Professor: సంబంధిత స్పెషాలిటీలో MD లేదా MS లేదా DNBతో పాటు నిర్దిష్ట బోధనా అనుభవం, పరిశోధనా ప్రచురణలు మరియు NMC నిబంధనల ప్రకారం అవసరమైన అర్హతలు ఉండాలి.
- Associate Professor: సంబంధిత విభాగంలో MD లేదా MS లేదా DNB, అవసరమైన Assistant Professor స్థాయి బోధనా అనుభవం, పరిశోధనా ప్రచురణలు తదితర అర్హతలు అవసరం.
- Assistant Professor: సంబంధిత స్పెషాలిటీలో MD లేదా MS మరియు సాధారణంగా ఒక సంవత్సరం Senior Resident అనుభవం అవసరం. NMC TEQ Regulations-2025 ప్రకారం కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.
- Tutor & Junior Resident: MBBS లేదా సమానమైన మెడికల్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థి MBBS అర్హతను Telangana Medical Councilలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన తర్వాత నిర్ణీత సమయంలో Telangana State Medical Councilలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
వయసు (Age)
- Professor, Associate Professor, Assistant Professor పోస్టులకు అభ్యర్థుల వయసు 69 సంవత్సరాల లోపు ఉండాలి.
- Tutor పోస్టులకు 45 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
వయసును నోటిఫికేషన్ తేదీ 03 సెప్టెంబర్ 2026 నాటికి పరిగణిస్తారు.
జీతం (Salary)
ఎంపికైన వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది:
- Professor: ఈ పోస్టులకు ₹1,90,000 వరకు
- Associate Professor: వీటికి ₹1,50,000 వరకు ఉంటుంది.
- Assistant Professor: ఈ పోస్టులకు ₹1,25,000 వరకు ఉంటుంది.
- Tutor: వీటికి ₹55,000 వరకు ఉంది.
- Junior Resident: వీళ్ళకి కూడా ₹46,000 వరకు వస్తుంది.
GMC Mahabubnagar Jobs 2026 పోస్టులకు ఈ వేతనం కాంట్రాక్ట్ కాలానికి వర్తిస్తుంది.
జాబ్ లొకేషన్
ఎంపికైన అభ్యర్థులు Government Medical College లో గాని లేదా Government General Hospital, Mahabubnagar, Telanganaలో విధులు నిర్వహించాలి. ఇంటర్వ్యూ Government Medical College, Edira Campus, Thirulmalla Hills, Mahabubnagar Districtలో ఉంటుంది.
జాబ్ వివరణ (About Job)
- Professor, Associate Professor మరియు Assistant Professor పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు మెడికల్ విద్యార్థులకు బోధన, క్లినికల్ ట్రైనింగ్, పరిశోధన మరియు సంబంధిత వైద్య విభాగాల్లో సేవలు అందించాలి.
- Tutor మరియు Junior Resident అభ్యర్థులు విద్యార్థుల శిక్షణతో పాటు ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజీ అవసరాలకు అనుగుణంగా వైద్య సేవల్లో పాల్గొనాలి. ఎంపికైన సిబ్బంది సంస్థ అవసరాలకు అనుగుణంగా పూర్తి సమయ సేవలు అందించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Fees Details)
GMC Mahabubnagar Jobs 2026 నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినట్లు ప్రత్యేకంగా పేర్కొనలేదు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లోని సూచనలను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన దరఖాస్తు పత్రాలతో Walk-in Interviewకు హాజరు కావాలి.
ఎంపిక విధానం (Selection Process)
GMC Mahabubnagar Jobs 2026 అభ్యర్థుల ఎంపిక NMC Teachers Eligibility Qualification (TEQ) Regulations-2025 మరియు నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది. Assistant Professor పోస్టులకు MD లేదా MS లేదా DNBలో సాధించిన మార్కులు, Tutor మరియు Junior Resident పోస్టులకు MBBS మార్కులను పరిగణిస్తారు. Professor, Associate Professor పోస్టులకు సంబంధిత క్యాడర్లోని బోధనా అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపిక దేశవ్యాప్తంగా ఉంటుంది, అయితే స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)
- అభ్యర్థులు ముందుగా Government Medical College Mahabubnagar అధికారిక వెబ్సైట్ నుంచి Application Formను పొందాలి. దరఖాస్తును పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హతలు, రిజిస్ట్రేషన్, అనుభవం తదితర ధ్రువపత్రాల Xerox కాపీలతో 15 సెప్టెంబర్ 2026న Walk-in Interviewకు హాజరు కావాలి.
- అభ్యర్థులు Original Certificatesతో పాటు రెండు సెట్ల self-attested Xerox copies తీసుకురావాలి. Aadhaar, PAN, Date of Birth proof, Study లేదా Bonafide Certificates, MBBS/MD/MS/DNB Certificates, Marks Memos, Medical Council Registration, Experience Certificates, Senior Residency Certificate, BCBR/MET Certificates వంటి పత్రాలు అవసరం.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నోటిఫికేషన్ విడుదల: 03 సెప్టెంబర్ 2026
- Walk-in Interview: 15 సెప్టెంబర్ 2026
- ఫలితాలు: 17 సెప్టెంబర్ 2026
- డ్యూటీలో చేరడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026
- ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:00 గంటలకు స్టార్ట్ అవుతుంది, అలాగే మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరుగుతుంది.
GMC Mahabubnagar Jobs 2026 నియామకాలు 31 మార్చి 2027 వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ముగిసే వరకు, ఏది ముందైతే అది వర్తించే విధంగా తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.
అధికారిక లింక్స్ (Official Links):
అధికారిక వెబ్సైట్ (Official Website Link):
అధికారిక నోటిఫికేషన్ PDF:
గమనిక: GMC Mahabubnagar Jobs 2026 కు వెళ్ళే అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు అధికారిక నోటిఫికేషన్లోని పూర్తి అర్హతలు, డాక్యుమెంట్లు మరియు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా యొక్క Website ను ఫాలో అవ్వండి, అలాగే ఫాస్ట్ నోటిఫికేషన్ కోసం మా whatsapp చానెల్ లో జాయిన్ అవ్వండి’
