Mission Shakti Recruitment 2026 | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు.. మహిళలకు సువర్ణావకాశం

Mission Shakti Recruitment 2026: మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత శాఖ (DW&CW&EO) ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం కింద కుప్పం, చిత్తూరు వన్ స్టాప్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు మాత్రమే పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం పోస్టులకు అప్లై చేసుకునేవారు దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.

Mission Shakti Recruitment 2026

పోస్టులు

Mission Shakti Recruitment 2026 రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:

Join Our WhatsApp Group
Join Now
పోస్టు పేరుఖాళీలువేతనం
Para Legal Personnel / Lawyer1₹20,000
Psycho-Social Counsellor1₹20,000
Case Workers3₹19,500
Multi-Purpose Staff / Helper4₹13,000
Security Guard / Night Guard3₹15,000

Mission Shakti Recruitment 2026 పోస్టులు One Stop Centre, Chittoor జిల్లా కుప్పం పరిధిలో పనిచేయడానికి ఉద్దేశించబడ్డాయి.

విద్యార్హత (Eligibility)

  • Para Legal Personnel / Lawyer: ఈ పోస్టులకు లా డిగ్రీతో పాటు లీగల్ ట్రైనింగ్ లేదా న్యాయ పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రాక్టీసింగ్ లాయర్ అయితే కోర్టులో లిటిగేషన్ అనుభవం కనీసం 2 సంవత్సరాలు ఉండాలి.
  • Psycho Social Counsellor: ఈ పోస్టులకు సైకాలజీ, సైకియాట్రీ లేదా న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. హెల్త్ సెక్టార్‌లో నేపథ్యం, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.
  • Case Worker: ఈ యొక్క పోస్టులకు లా, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్ లేదా సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు మహిళలకు సంబంధించిన రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • Multi-Purpose Staff/Helper: ఈ పోస్టులకు చదవడం, రాయడం వచ్చి సంబంధిత రంగంలో పరిజ్ఞానం లేదా అనుభవం ఉండాలి. హైస్కూల్ పాస్ లేదా సమానమైన అర్హత ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
  • Security Guard/Night Guard: ఈ పోస్టులకు మాత్రం ప్రభుత్వ లేదా పేరున్న సంస్థలో సెక్యూరిటీ సిబ్బందిగా కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. రిటైర్డ్ మిలిటరీ/పారా మిలిటరీ సిబ్బందికి ప్రాధాన్యత ఉంటుంది.

వయసు పరిమితి (Age)

అన్ని పోస్టులకు 2026 జనవరి 1 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం (Salary)

Mission Shakti Recruitment 2026 పోస్టును బట్టి నెలవారీ వేతనం ₹13,000 నుంచి ₹20,000 వరకు ఉంటుంది.

  • అత్యధికంగా Para Legal Personnel/Lawyer మరియు Psycho-Social Counsellor పోస్టులకు ₹20,000 వరకు ఉంటుంది.
  • Case Workersకు ₹19,500
  • Security Guard/Night Guardకు ₹15,000
  • Multi-Purpose Staff/Helperకు ₹13,000 వరకు సేలరీ అందుతుంది.

ఉద్యోగ వివరణ (About Job)

Mission Shakti Recruitment 2026 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు Mission Shakti Scheme కింద One Stop Centreలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలకు సంబంధించిన సహాయక సేవలు, కౌన్సెలింగ్, లీగల్ సపోర్ట్, కేసుల నిర్వహణ, సెంటర్‌కు సంబంధించిన సహాయక మరియు భద్రతా విధులను పోస్టును బట్టి నిర్వహించాల్సి ఉంటుంది.

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగాలు కుప్పం మరియు చిత్తూరు, ఆంధ్రప్రదేశ్లోని One Stop Centresలో ఉంటాయి. రిక్రూట్‌మెంట్‌ను చిత్తూరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత శాఖ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ నోటిఫికేషన్‌ను Recruitment/Notices విభాగంలో ప్రచురించారు.

అప్లికేషన్ ఫీజు (Fees Details)

Mission Shakti Recruitment 2026 నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినట్లు ఎటువంటి వివరాలు పేర్కొనలేదు. కాబట్టి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం (Selection Process)

అర్హత కలిగిన అభ్యర్థులను ఓరల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని District Selection Committee నిర్వహిస్తుంది. అర్హత, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి Application Formను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం 2026 సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంది. ఫారాన్ని పూర్తిగా నింపి, విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలు, కమ్యూనిటీ/కుల ధ్రువపత్రం తదితర అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలి. అనంతరం దరఖాస్తును DW&CW&EO, 2వ అంతస్తు, అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు చిరునామాకు సమర్పించాలి. ఒక పోస్టుకు ఒక అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • నోటిఫికేషన్ తేదీ: 07 సెప్టెంబర్ 2026
  • దరఖాస్తుల ప్రారంభం: 07 సెప్టెంబర్ 2026, ఉదయం 10:00 గంటల నుంచి
  • దరఖాస్తుల చివరి తేదీ: 17 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది.

చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

Join Our WhatsApp Group
Join Now

అధికారిక లింక్స్ (Official Links)

చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్:

అధికారిక నోటిఫికేషన్ PDF:

Application Form:

What’s App Link:

గమనిక: Mission Shakti Recruitment 2026 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, పత్రాలు మరియు ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా వెబ్సైట్ ని ఫాలో లేదా subscribe చేస్కోండి, నోటిఫికేషన్ updates మీకు పోస్ట్ చేసిన వెంటనే వస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top