కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC JE Recruitment 2026 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, టెలికాం విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్లో Scientific Assistant పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. మొత్తం 1,748 పోస్టులు తాత్కాలికంగా ప్రకటించారు.

పోస్టులు
SSC JE Recruitment 2026లో మొత్తం 1,748 పోస్టులు ఉన్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ప్రధానంగా ఉద్యోగాలు లభించే సంస్థలు:
- Border Roads Organisation బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (BRO)
- Central Water Commission సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)
- Central Public Works Department సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD)
- Central Water & Power Research Station సెంట్రల్ వాటర్ & పవర్ రిసెర్చ్ స్టేషన్ (CWPRS)
- DGQA-Naval
- Farakka Barrage Project ఫారక్క బేరేజి ప్రాజెక్టు
- Military Engineer Services మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES)
- National Technical Research Organisation నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO)
- Directorate General of Lighthouses & Lightships డైరెక్ట్ రేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ & లైట్ షిప్స్
- Department of Telecommunications డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్
- India Meteorological Department ఇండియా మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD)
- Ministry of Fisheries, Animal Husbandry & Dairying మినిస్ట్రీ ఆఫ్ ఫిషెరిస్ అనిమల్ హస్బండరీ & డైరీయింగ్
ఖాళీల సంఖ్య శాఖలు, పోస్టుల వారీగా విభజించబడుతుంది. ప్రకటించిన 1,748 సంఖ్య తాత్కాలికమైనది కావడంతో భవిష్యత్తులో మార్పులు ఉండే అవకాశం ఉంది.
విద్యార్హత (Eligibility)
SSC JE Recruitment 2026 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా అర్హతగా ఉంటుంది.
- Civil Engineering: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా అవసరం. కొన్ని సంస్థల్లో డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం కూడా తప్పనిసరి.
- Electrical Engineering: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా అవసరం.
- Mechanical Engineering: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హతగా ఉంటుంది.
- Telecom: సంబంధిత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో BE/B.Tech అర్హత అవసరం.
- Scientific Assistant – IMD: ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా B.Sc లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న సంబంధిత ఇంజినీరింగ్/కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిగ్రీ అర్హత అవసరం.
వయసు (Age)
అభ్యర్థుల వయసును 01 ఆగస్టు 2026 నాటికి లెక్కిస్తారు. పోస్టును బట్టి గరిష్ట వయసు 30 లేదా 32 సంవత్సరాలుగా ఉంటుంది.
- CPWD, Directorate General of Lighthouses & Lightships వంటి కొన్ని పోస్టులకు గరిష్ట వయసు 32 సంవత్సరాలు కాగా, చాలా పోస్టులకు 30 సంవత్సరాల వరకు వయసు పరిమితి ఉంది.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది.
జీతం (Salary )
SSC JE Recruitment 2026 ఉద్యోగాలు Group-B Non-Gazetted పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం Pay Level-6 ప్రకారం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఉద్యోగ వివరణ (About Job)
SSC JE Recruitment 2026కు ఎంపికైన జూనియర్ ఇంజనీర్లు వారికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజినీరింగ్‌కు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్మాణ పనుల పర్యవేక్షణ, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ అమలు చేయడం, సాంకేతిక తనిఖీలు, ఎలక్ట్రికల్/మెకానికల్ పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు పోస్టు మరియు శాఖను బట్టి ఉంటాయి.
జాబ్ లొకేషన్
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో పోస్టింగ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉండవచ్చు. అభ్యర్థుల ఎంపిక, పోస్టు కేటాయింపు మరియు సంస్థ అవసరాలను బట్టి ఉద్యోగ స్థానం నిర్ణయించబడుతుంది.
అప్లికేషన్ ఫీజు (Fees)
- Latest SSC JE Recruitment 2026 అప్లై చేసే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అయితే మహిళా అభ్యర్థులు SC, ST, PwBD మరియు అర్హత కలిగిన Ex-Servicemen అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
- అప్లికేషన్ ఫీజును BHIM UPI, Net Banking లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు.
ఎంపిక విధానం (Selection Process)
SSC JE Recruitment 2026లో అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా జరుగుతుంది.
- Paper-I మరియు Paper-II రెండు కూడా Computer Based Examination ఉంటుంది.
- ఫైనల్ గా Document Verification ఉంటుంది.
Paper-I ద్వారా అభ్యర్థులను Paper-IIకి షార్ట్‌లిస్ట్ చేస్తారు. Paper-IIలో సాధించిన మార్కులు తుది మెరిట్ మరియు పోస్టు కేటాయింపులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనంతరం సంబంధిత శాఖ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)
SSC JE Recruitment 2026 కు అర్హత కలిగిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా కొత్త SSC వెబ్సైట్లో One-Time Registration (OTR) పూర్తి చేయాలి. అనంతరం SSC JE 2026 అప్లికేషన్‌ను ఎంచుకుని వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, పోస్టు/పరీక్షకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
ఫోటో, సంతకం తదితర వివరాలను నోటిఫికేషన్లో సూచించిన విధంగా సమర్పించి, వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించి ఫారాన్ని Submit చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత Application Form కాపీని భద్రపరచుకోవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నోటిఫికేషన్ విడుదల: 02 సెప్టెంబర్ 2026
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 02 సెప్టెంబర్ 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2026 రాత్రి 11:00 గంటల వరకు
- అప్లికేషన్ కరెక్షన్ విండో: 28–30 సెప్టెంబర్ 2026
- Paper-I పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2026 లో ఉంటుంది.
- Paper-II పరీక్ష: డిసెంబర్ 2026 న జరుగుతుంది.
అధికారిక లింక్స్ (Official Links)
SSC అధికారిక వెబ్సైట్:
SSC JE 2026 అధికారిక నోటిఫికేషన్:
Apply Online:
గమనిక: SSC JE 2026లో ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో తమ పోస్టుకు సంబంధించిన విద్యార్హత, వయసు, అనుభవం, శాఖ మరియు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
