APPSC Forensic Lab Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి నిరుద్యోగులకు ముఖ్యమైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. A.P. State Forensic Science Laboratory Serviceలో Assistant Director పోస్టుల భర్తీకి Notification విడుదల చేశారు. మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో విద్యార్హతతో పాటు కనీసం 5 సంవత్సరాల ల్యాబొరేటరీ అనుభవం అవసరం. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ 06-10-2026 నుండి అప్లై చేసుకోవచ్చు.

ఎన్ని పోస్టులు?
A.P. State Forensic Science Laboratory Serviceలో మొత్తం 8 Assistant Director పోస్టులు ఉన్నాయి.
- Forensic Engineering – 1 పోస్టు
- Physics – 2 పోస్టులు
- Chemistry – 2 పోస్టులు
- Biology – 3 పోస్టులు
మొత్తం: 8 పోస్టులు (7 Regular + 1 Carried Forward).
విద్యార్హత
Forensic Engineering: Mechanical లేదా Structural Engineeringలో B.E. లేదా సమానమైన Civil/Production Engineeringలో B.E./B.Tech ఉండాలి.
Physics: M.Sc Physics లేదా సంబంధిత సమానమైన అర్హతలు ఉండాలి.
Chemistry: M.Sc Chemistry లేదా Forensic Sciencesలో A.I.C ద్వారా B.Sc అర్హత ఉండాలి.
Biology: M.Sc లేదా Biotechnology, Genetics, Forensic Science వంటి సమానమైన అర్హత ఉండాలి. Medicine Degreeతో పాటు B.Sc కూడా అర్హతగా పేర్కొన్నారు.
అదనంగా, అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల Forensic Science, Chemistry, Analytical లేదా Police Laboratoryలో practical experience ఉండాలి. మంచి కంటి చూపు తప్పనిసరి కాగా, Colour Blindness ఉంటే అనర్హతగా పరిగణిస్తారు.
వయసు
APPSC Forensic Lab Recruitment 2026 లో ప్రస్తుతం విడుదలైన Brief Notificationలో వయోపరిమితికి సంబందించిన వివరాలు ఇవ్వలేదు. వయస్సు, రిజర్వేషన్ తదితర పూర్తి వివరాలను Detailed Notificationలో APPSC ప్రకటించనుంది. Detailed Notification 06-10-2026లోపు విడుదల కానుంది.
జీతం
ఈ APPSC Forensic Lab Recruitment 2026 లో Assistant Director పోస్టులకు రూ.57,100 – రూ.1,47,760 వరకు Pay Scale ఉంటుంది.
జాబ్ వివరణ
APPSC Forensic Lab Recruitment 2026 కు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో తమకు సంబంధించిన విభాగాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించాలి. Forensic Engineering, Physics, Chemistry లేదా Biology సంబంధిత సాంకేతిక, ప్రయోగశాల కార్యకలాపాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్
ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలో మాత్రమే ఉంది.
అప్లికేషన్ ఫీజు
ప్రస్తుతం విడుదలైన Brief Notificationలో అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. Detailed Notification విడుదలైన తర్వాత ఫీజు వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చెక్ చేయాలి.
ఎంపిక విధానం
ఈ APPSC Forensic Lab Recruitment 2026 పోస్టులకు Screening Test ఉండదు. దరఖాస్తుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ Single Level Examination నిర్వహిస్తారు.
పరీక్ష Computer Based Recruitment Test (CBRT) విధానంలో ఉంటుంది.
- Paper-I: General Studies & Mental Ability – 150 మార్కులు
- Paper-II: సంబంధిత Subject – 300 మార్కులు
- మొత్తం – 450 మార్కులు
ప్రతి పేపర్‌కు 150 నిమిషాల సమయం ఉంటుంది. అనంతరం Computer Proficiency Test (CPT) కూడా ఉంటుంది. CPT మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
APPSC Forensic Lab Recruitment 2026 అప్లై చేసే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- APPSC అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
- Notification ను పరిశీలించాలి.
- Online Application లింక్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- విద్యార్హత, అనుభవం తదితర వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను సమర్పించాలి.
- అప్లికేషన్‌ను Submit చేసి, భవిష్యత్ అవసరాల కోసం కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 15-09-2026
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-10-2026
- దరఖాస్తుల చివరి తేదీ: 27-10-2026 వరకు
అధికారిక లింక్స్
APPSC అధికారిక వెబ్సైట్:
నోటిఫికేషన్ PDF:
